దైవత్వం ఉందని : 27 ఏళ్ల తర్వాత కేరళకి పాస్టర్ అస్థికలు

PASTERచనిపోయిన పాస్టర్ పేరుతో ప్రార్థనలు చేస్తే అనుకున్న పనులు జరుగుతున్నాయని తెలిసి, 27 సంవత్సరాల క్రితం మరణించిన పాస్టర్ అస్తికలను బయటికి తీశారు.  27 సంవత్సరాల క్రితం మరణించిన ఓ పాస్టర్‌ ను సమాధి చేయగా.. మంగళవారం (ఏప్రిల్-17) కేరళ పాస్టర్లు అతని అస్థికలను సేకరించి తమ రాష్ర్టానికి తరలించారు. ఈ అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.

వివరాలు ఇలా.. కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన పాస్టర్ సైమన్ స్ట్రోక్ విధినిర్వహణలో భాగంగా కొత్తగూడెంలోని RCM చర్చికి వచ్చారు. 1991 నవబంర్ 17న ఆయన ఇక్కడ కన్నుమూశారు. కేరళ నుంచి వచ్చిన పాస్టర్ ల సమక్షంలో ఆనాడు కొత్తగూడెంలోని RCM చర్చి వెనుక బరెల్ గ్రౌండ్ లో ఖననం చేశారు. ఆయన పేరిట ప్రార్థనలు చేస్తే అనుకున్న పనులు జరుగుతున్నాయని కొందరు బలంగా నమ్ముతుండటంతో..కొత్తగూడెంలో ఉన్న ఆయన సమాధి నుంచి సైమన్ అస్థికలను కేరళకు తరలించే అవకాశం కల్పించాలని అక్కడి బిషన్ OCD ప్రొవెన్షియల్ కు 2016లో లెటర్ రాశారు.

ఈ మేరకు కలెక్టర్ ద్వారా అనుమతులు తీసుకున్నారు. దీంతో కేరళ నుంచి వచ్చిన RCM పాస్టరేట్ టీమ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్-17) రెవిన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణలో సమాధిని తవ్వి అందులో నుంచి అతని అస్థికలను శవపేటికలో భద్రపరిచి కేరళకు తరలించారు. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని అస్థికలను కొత్తగూడెంలోనే భద్రపరిచేందుకు అవకాశం కల్పించారు.  అరుదైన ఘటనను చూసేందుకు భారీ సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చారు.

 

Posted in Uncategorized

Latest Updates