దొంగతనమే అతని ఉద్యోగం

theafవరుస దొంగ తనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు సోమవారం(ఫిబ్రవరి-5) అరెస్టు చేశారు. ఈ దొంగ చోరీలకు పాల్పడుతున్నది ఒకటో..రెండు ఏళ్లుగా కాదు. ఏకంగా 39 ఏళ్లుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాడు.

హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో 19 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ మంత్రి శంకర్ ను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ పోలీసులు. శంకర్ నుంచి 370 గ్రాముల బంగారు నగలతో పాటు.. 3 లక్షల ఇరవై వేలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. రెండు కమిషనరేట్ పరిధిలో శంకర్ పై 250కి పైగా కేసులు ఉన్నట్లు  తెలిపారు సీపీ శ్రీనివాస్ రావు. దోచుకున్న బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువపెట్టి డబ్బులు తీసుకుంటాడన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడతారన్న సీపీ….రెండు సార్లు శంకర్ పై పీడీ యాక్ట్ నమోదు అయినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates