దొంగనోట్ల ముద్రణ సూత్రధారి అఫ్తాబ్‌ అరెస్టు

భోపాల్‌: దొంగనోట్ల ముద్రణ సూత్రధారి అఫ్తాబ్‌ అలీ(42)ని అరెస్టు చేశారు పోలీసులు. ఏకంగా మూడుకోట్ల రూపాయల దొంగనోట్ల ముద్రణకు తనకు ఆర్డరు వచ్చింది పోలీసులకు చెపుతున్నాడు అఫ్తాబ్‌ అలీ. మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు వచ్చేనెలలో జరగాల్సి ఉన్నందున తనకు ఈ మేరకు ఆర్డరు వచ్చిందన్నారు. అయితే, అఫ్తాబ్‌కు ఈ ఆర్డరు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. నకిలీనోట్ల ముద్రణకు ఉపయోగించిన కాగితం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్నీ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇటీవల రాజ్‌ గర్‌, హోషన్‌ గాబాద్‌ల నుంచి అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులను విచారిస్తున్నప్పుడు సూత్రధారిగా అఫ్తాబ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారినుంచి రూ.31.50 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా రూ.2 వేలు, రూ.5 వందల నోట్లేనని పోలీసులు వెల్లడించారు. ముస్తాక్‌ ఖాన్‌గా కూడా పిలుచుకునే అఫ్తాబ్‌ అలీ దొంగనోట్ల ముద్రణ సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates