దొంగలుగా మారుతున్న ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దొంగలుగా మారుతున్నారు. ఆయుధాలు టార్గెట్ గా చోరీలు చేస్తున్నారు. అనంతనాగ్ జిల్లా బ్రక్ పొడా ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర్నుంచి బోర్ రైఫిల్ లాక్కుని పారిపోయారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేష్ మొదలు పెట్టాయి. ఈ మధ్య పోలీసుల నుంచి తుపాకుల చోరీ చేసిన ఇద్దరు ఉగ్రవాదులను… భద్రతా బలగాలు చంపేశాయి. కుప్వారా జిల్లా ఖుమ్రియాల్ లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ, CRPF జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు ప్రారంభించారు జవాన్లు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates