దొంగలు అనుకుని గ్రామస్థుల దాడి..ఇద్దరు మృతి

DEATHదొంగల భయం ఇప్పుడు మహారాష్ట్రకు చేరింది. కొన్ని రోజులుగా దొంగల అనుకుని సామాన్యులను కొట్టి చంపిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది. దొంగలు అనుకొని ఎనిమిది మందిని గ్రామస్థులు చితకబాదారు. దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  ఔరంగాబాద్ జిల్లా చందగావ్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది.  దాడిలో  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన 300 మంది గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates