దొంగల అతి తెలివి : అంబులెన్స్ లో ఆవుల తరలింపు

cow smaglingదొంగ‌లు ఈజీగా త‌ప్పించుకోవ‌టానికి అతి తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పోలీసుల‌ కంట‌ప‌డ‌కుండా కొత్త‌ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఆవుల‌ను అంబులెన్స్ లో ఎత్తుకెళ్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. సోమవారం (జూన్-18) సీతాఫ‌ల్ మండి వీది సంత‌లో ప‌డేసిన‌ మేత‌ కోసం వెళ్ళిన‌ ఆవును అంబులెన్స్ లో ఎత్తుకెళ్తూ సిసి టివి పుటేజిలకు చిక్కారు దొంగలు.

మ‌హ‌మ్మ‌ద్ ఆయూబ్ అనే వ్యక్తిపై 10 జిల్లాల్లో 150 కేసులు ఉన్నాయి. అనేక‌ సార్లు జైలుకు వెళ్ళి వ‌చ్చారు. పిడి యాక్ట్ లో కూడా జైలుకు వెళ్ళాడు. అయినా అదే దొంగ‌త‌నాలు చేస్తున్నాడు. ఇత‌నికి తోడు స‌ద్దాం ఖురేసి. బాబాలు దొంగ‌త‌నాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. ముగ్గురిపై గ‌తంలో కేసులున్నాయి. ఇటీవ‌లే జైలు నుంచి పిబ్ర‌వ‌రిలో రిలీజ్ అయి.. 17 చోట్ల‌ దొంగ‌తనాలు చేశారు. ఓ ప్ర‌వేటు ఆసుప‌త్రి అంబులెన్స్ ను కొని అందులొకి ఆవుల‌ను త‌ర‌లిస్తూ ఎవ‌రికీ అనుమానం రాకుండా త‌ప్పించుకుంటున్నారు.

దొంగిలించిన‌ ఆవుల‌ను త‌క్కువ‌ ధ‌ర‌కు అమ్ముతూ వ‌చ్చిన‌ డ‌బ్బుల‌తో బెయిల్ తెచ్చుకుని జ‌ల్సాలు చేస్తూ మ‌ళ్ళీ దొంగ‌త‌నాలు చేస్తున్నారు. సిసి పుటేజి ఆదారంగా అంబులెన్స్ ను గుర్తించిన పోలీసులు అయూబ్, సద్దాం ఖురేసి ల‌ను అరెస్ట్ చేశారు. మ‌రో వ్య‌కి బాబా ప‌రారిలో ఉన్నారు. వీరి నుంచి ఒక‌ ఆవు, 7 ల‌క్ష‌ల‌ 50 వేల‌ న‌గ‌దు…అంబులెన్స్ వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను రిమాండ్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు నార్త్ జోన్ డిసిపి సుమ‌తి.

 

Posted in Uncategorized

Latest Updates