దోస్త్ మేరా దోస్త్ : అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ చంద్రబాబు మిత్రుడే

పార్టీలు వేరు కావచ్చు కానీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మిత్రుడేనన్నారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. చంద్రబాబుతో బంధం తెగిపోలేదని, మిత్రుత్వం కొనసాగుతుందని పార్లమెంట్ సాక్షిగా స్పష్టంగా చెప్పారు. లోక్ సభలో శుక్రవారం(జులై-20) అవిశ్వాస తీర్మాన నోటీస్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వేరు కావొచ్చు కానీ.. చంద్రబాబుతో ఉన్న బంధం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సమయంలో సభలోనే ఉన్న టీడీపీ ఎంపీలు ఎలాంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. రాజ్ నాథ్ ఈ మాటలు అంటుంటే.. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత విభజన బిల్లులోని అంశాలను ప్రస్తావిస్తూ.. ఏపీ రాష్ట్రానికి ఏం చేశామో వివరించారు. నిధుల విడుదల లిస్ట్ చదివారు. ఆ సమయంలో మాత్రం టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ లేచి నిలబడ్డారు. అభ్యతరం వ్యక్తం చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన రాజ్ నాథ్ సింగ్.. సభలో ఉండటం, వాకౌట్ చేయటం అనేది మీ ఇష్టం.. ప్రజాస్వామ్యంలో ఇది హక్కు అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అనేది 14వ ఫైనాన్స్ కమిషన్ లో లేదని స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఏపీ అభివృద్ధి కట్టుబడి అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. చట్టంలోని చెప్పిన ఇనిస్టిట్యూట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నామని.. నిధులు కూడా విడుదల చేస్తున్న విషయాలను సభలో వెల్లడించారు. విభజన తర్వాత ఏపీలో పరిస్థితులపై అవగాహన ఉందని.. అందుకే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు బీజేపీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మిత్రుడే అంటూ రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, టీడీపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుుతున్నాయి. టీడీపీ – బీజేపీ బయటకు తిట్టుకుంటూ.. లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారా ఏంటీ అనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత బయటకు వచ్చారు. 2014 ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేసి.. నాలుగేళ్లు అధికారం పంచుకుని.. ఇటీవలే బయటకు వచ్చింది టీడీపీ. ప్యాకేజీకి అంగీకారం తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి చంద్రబాబు.. ఆ తర్వాత హోదా అంటూ ఉద్యమ బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే…

Posted in Uncategorized

Latest Updates