ద్రవిడ్ కు ICC గుర్తింపు

RAHULఅండర్-19 కోచ్ గా అద్భుతాలు సృష్టిస్తున్న భారత లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ మండలి ICC హాల్ ఆఫ్ ఫేమ్‌ లో స్థానం ద‌క్కించుకున్నాడు ద్రవిడ్ . దుబాయ్‌ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ICC చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచ‌ర్డ్‌ స‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ద్ర‌విడ్‌ తోపాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, ఇంగ్లండ్ మ‌హిళా జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ క్ల‌యిర్ టైల‌ర్‌ కు ఈ అరుదైన గౌర‌వాన్ని క‌ల్పించింది ICC.

దీంతో ICC హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు ద‌క్కించుకున్న ఐదో భార‌త ఆట‌గాడిగా ద్ర‌విడ్ నిలిచాడు. ద్ర‌విడ్ కంటే ముందు బిష‌న్ సింగ్ బేడీ, సునీల్ గ‌వాస్క‌ర్‌, క‌పిల్ దేవ్‌, అనిల్ కుంబ్లేలు ఈ లిస్టులో చోటు సంపాదించారు. ఇక‌, ఆసీస్ త‌ర‌ఫున ఈ ఘ‌న‌త సాధించిన 25వ ఆట‌గాడిగా రికీ పాంటింగ్ నిలిచాడు. త‌న‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌ లో చోటు ద‌క్క‌డంపై రాహుల్ ద్ర‌విడ్ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది ప్ర‌తీ ఒక్క క్రికెట‌ర్ క‌ల అని, ఇదొక గొప్ప గౌర‌వం అని తెలిపాడు ద్రవిడ్.

Posted in Uncategorized

Latest Updates