ద్రవిడ్ బెస్ట్ విషెస్ బ్యాట్.. హాఫ్ సెంచరీతో రహానె

అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్మాచ్ లో నాలుగవ రోజు రహానె హాప్ సెంచరీ తో ఫాం లోకి వచ్చాడు. ఈ సిరీన్ లో తక్కువ స్కోరుకే అవుట్ అవుతూ తన పై పెట్టుకున్న ఆశలను వమ్ము చేసిన ఆజింక్య రహానె.. నాలుగవరోజు మాత్రం చెలరేగి ఆడాడు. పుజారాతో కలిసి 87 పరుగుల విలువైన స్కోరును నమొదు చేశాడు. మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో ఆదివారం ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. బ్యాట్‌పై ‘బెస్ట్‌ విషెస్‌, రాహుల్‌ ద్రవిడ్’ అని రాసి ఉంది. ఇప్పుడు ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి. రెహానె ఫాం లోకి రావడానికి ఈ బ్యాట్ కూడా ఓ కారణమే అంటున్నారు క్రికెట్ ప్రేమికులు.

Posted in Uncategorized

Latest Updates