ద టీమ్‌ ఫ్లాష్, VDA అసోసియేట్స్‌ సర్వేలు : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అందరి దృష్టి రాజకీయాలపైనే పడింది. ఈ క్రమంలోనే పలు సర్వేలు రిపోర్టులను వెల్లడిస్తున్నాయి. లేటెస్ట్ గా నిర్వహించిన సర్వేల ప్రకారం తెలంగాణలో మరోసారి TRS విక్టరీ సాధిస్తుందని స్పష్టం చేశాయి. సీ–వోటర్, టైమ్స్‌ నౌ, ఐటీటెక్‌ గ్రూప్‌ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఓ రిపోర్ట్ ను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం త్వరలో ఎన్నికలు జరిగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో BJP ప్రస్తుతం అధికారంలో ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాలను ఈసారి కాంగ్రెస్‌ చేజిక్కించుకోనుంది. అదే జరిగితే వచ్చే లోక్‌ సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్‌ కు కొత్త శక్తి వస్తుంది.

తెలంగాణ: రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ద టీమ్‌ ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్‌ అనే రెండు సంస్థలు వేర్వేరుగా జరిపిన సర్వేలను విశ్లేషించిన అనంతరం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపడుతుందని తెలిపింది. విశ్లేషణల ప్రకారం టీఆర్‌ఎస్‌ 85 సీట్లు గెలవనుండగా, కాంగ్రెస్‌ 18 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. MIM -7, BJP- 5, ఇతరులు నాలుగు సీట్లు గెలవొచ్చని అంచనా వేశాయి.

Posted in Uncategorized

Latest Updates