ధనవంతుల లిస్టులో జుకర్‌బర్గ్.. బఫెట్‌ను దాటేశారు

markఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఆస్తులు పెరిగాయి. దీంతో అమెరికన్ బిజినెస్ మెన్ వారెన్‌ బఫెట్‌ను అధిగమించేసి ప్రపంచంలోనే మూడో ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన సంపన్నుల లిస్టులో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. శుక్రవారం(జులై-6) ఫేస్‌బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో జుకర్‌బర్గ్ మూడవ స్థానంలో ఉన్న బఫెట్‌ను దాటేసారు. ధనవంతుల లిస్టులో మొదటి మూడు స్థానాల్లోనూ టెక్నాలజీ సంస్థల అధినేతలే ఉండడం ఇదే తొలిసారి అని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.

ప్రస్తుతం 34 ఏళ్ల జుకర్‌బర్గ్ ఆస్తులు 5.61 లక్షల కోట్లు గా ఉంటుందని అంచనా వేసారు. బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ సీఈఓ వారెన్ బఫెట్ కన్నా సుమారు 2,565 కోట్ల బుకర్‌బర్గ్ ఎక్కువ సంపాదించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates