ధర్మపురి సంజయ్ పై నిర్భయ కేసు నమోదు

రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ తమను లైగికంగా వేధిస్తున్నాడని గురువారం (ఆగస్టు-2) 11 మంది విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ లో ధర్మపురి సంజయ్‌ పై శుక్రవారం (ఆగస్టు-3) నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. నర్సింగ్ విద్యార్థినుల ఫిర్యాదుతో సంజయ్‌పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 342, 354, 506, 354ఎ(నిర్భయ చట్టం) కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సంజయ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా.. ఇంట్లో లేరు. దీంతో ధర్మపురి సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates