ధర్మసాగర్ లో క్రీడా కాంప్లెక్స్: కడియం

kadiyamవరంగల్ సమగ్రాభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో 120 ఎకరాల్లో క్రీడా కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భద్రకాళి చెరువు, వడ్డేపల్లి, ఉరుసు చెరువులను సుందరీకరిస్తామన్నారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో 6 ప్రధాన మార్గాలను ఆదర్శ రోడ్లుగా తయారు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం.

 

 

Posted in Uncategorized

Latest Updates