ధూంధాం చేశాడు : మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు.. పార్టీకి రండి

TENTH FAIL STUDENT

విషయం వింటే మరీ టూమచ్ గా అనిపించొచ్చు.. ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు.. కానీ అతను చేశాడు. అందుకే ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కొడుకు 10వ తరగతి ఎగ్జామ్స్ రాశాడు.. రిజల్ట్స్ వచ్చాయి. బాబు ఫెయిల్ అయ్యాడు.. ఇంట్లో యుద్ధం జరగొచ్చు అని భయపడ్డాడు పిల్లోడు.. అబ్బే అక్కడ సీన్ రివర్స్. ధూంధాం పార్టీ జరిగింది. దీపావళి చేశాడు. అందరికీ ఫోన్ చేశాడు. పెద్ద శుభకార్యం వలే.. కొడుకు ఫెయిల్ పార్టీని అద్భుతంగా ఇచ్చి.. అందరితో నువ్వు తోపు, తురుంఖాన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ సిటీ. శివాజీ వార్డ్ లో సురేంద్రకుమార్ వ్యాస్ అనే కుటుంబం నివాసం ఉంటుంద. అతను ట్రాన్స్ పోర్ట్ బిజినెస్. మంగళవారం 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. కుమారుడు అన్షు.. ఫెయిల్ అయ్యాడు. మూడు సబ్జెక్ట్స్ తప్పాడు. రిజల్ట్స్ చూసిన ఆ తండ్రి ఏ మాత్రం బాధపడలేదు. ఫెయిల్ అయినందుకు ఎగిరిగంతేశాడు. ఇంటి ముందు టెంట్ వేశాడు. టపాసులు కాల్చాడు. ఫ్రెండ్స్, బంధువులను పిలిచాడు. స్వీట్స్ పంచాడు. బిర్యానీ తినిపించాడు. మందు పార్టీ కూడా ఇచ్చాడు. ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు అంతా.. విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఏంటయ్యా ఇదంతా అని అడిగితే.. ఫెయిల్ అయ్యాడని కొడుకును తిడితే, కొడితే ఏం వస్తుంది.. వాడు ఫీలయ్యి ఏమైనా చేసుకుంటే ఇంకెంత ఘోరం చూడాలి.. అందులో వాడిలో మనోధైర్యం కోసం ఇలా పార్టీ ఇస్తున్నాను. జీవితం పాస్, ఫెయిల్ అనే విషయాల కంటే.. ఇంకా ఎన్నో ఉన్నాయి. దీని కోసం వాడిని తిట్టటం ఇష్టం లేదు అన్నాడు.

తండ్రి రియాక్షన్ పై కొడుకు స్పందన కూడా ఉంది. నాకు అసలు చదువుపై ఇంట్రస్ట్ లేదు. బలవంతంగా చదువుకుంటున్నాను. డాడీ చేసే ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చూసుకోవాలని.. వ్యాపారం చేయాలని ఆశ ఉంది అంటున్నారు. ఇంకేముందీ.. తండ్రికి తగ్గ కొడుకు.. సరిపోయారు.. జీవితం వీళ్లు ఇంకా చాలా సాధిస్తారు అంటూ తిని, తాగి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది…

Posted in Uncategorized

Latest Updates