ధైర్యముంటే నా శిరచ్ఛేదం చేయాలి : యోగీకి ఒవైసీ సవాల్


హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు  సవాల్ చేశారు మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. సీఎం యోగీకి ధైర్యముంటే తన శిరచ్చేధం చేయాలన్నారు అసదుద్దీన్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం నవాబు పారిపోయినట్లు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వదిలి పారిపోతాడని యూపీ సీఎం యోగి విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ హైదరాబాద్ గడ్డపై నుంచి తనను కాని ఏ ముస్లిమును కూడా పారిపోయేలా ఎవరూ చేయలేరని అసద్  ఇవాళ మలక్ పేటలో జరిగిన సభలో స్పష్టం చేశారు. మరాఠీలు, గుజ్జర్లు, జాట్ లకు కులపరమైన రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ ప్రభుత్వం ముస్లిముల రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుందని నిలదీశారు అసదుద్దీన్. దళిత ముస్లిములు, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిములకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఒవైసీ.

Posted in Uncategorized

Latest Updates