నకిరేకల్ లో కారు- ఆటో ఢీ.. ఇద్దరు మృతి

caraccident0325నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (మార్చి-25) నకిరేకల్ మండలం చందంపల్లి స్టేజ్ దగ్గర ఆటో ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరోఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా దగ్దమైంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు చందపల్లి ఊర్లోకి రోడ్ క్రాస్ అవుతున్న ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates