నకిలీ పేటీఎం తో సూపర్ మార్కెట్లకు టోకరా

paytm-cheatingనకిలీ పేటీఎం యాప్ ఇన్ స్టాల్ చేసి సూపర్ మార్కెట్లను మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ యాప్ తో సరుకులు కొనుగోలు చేయడంతో పాటు… మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించారు. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారని తెలిపారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల బారిన పడకుండా నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates