నకిలీ వెబ్ సైట్లు: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

certificateహైదరాబాద్ లో మరో భారీ సైబర్‌ మోసం బయటపడింది. నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు నగర సీసీఎస్ పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్‌ ప్రారంభించారు ముగ్గురు వ్యక్తులు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు మంగళవారం(మే-29) ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్‌సైట్‌లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి రూ. 2.5 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురు ఢిల్లీకి చెందిన వారుగా సమాచారం.

Posted in Uncategorized

Latest Updates