నకిలీ సర్టిఫికెట్ కేసు : ఉద్యోగం కోల్పోయిన క్రికెటర్

నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు కేరళ క్రికెటర్ రోహన్ ప్రేమ్. తిరువనంతపురంలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో అతను ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2015లో అతనికి ఉద్యోగం వచ్చింది. అయితే ఫోర్జరీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చాడన్న ఆరోపణలతో అతన్ని రెండు నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించారు.

యూపీలోని ఝాన్సీ యూనివర్సిటీ నుంచి రోహన్ బీకామ్ పట్టా పొందాడు. దీని గురించి యూనివర్సిటీని ఆరా తీయగా, అతను అక్కడ చదువుకోలేదని తేలింది. దీంతో క్రికెటర్ రోహన్ ఆడిటర్ ఉద్యోగం ఊడింది. 31 ఏళ్ల రోహన్ మొన్నటి వరకు కేరళ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. చివరి రంజీ సీజన్‌లోనూ అతను రాష్ట్ర జట్టుకు ఆడాడు. సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో FIR నమోదు చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది కాగ్.

 

Posted in Uncategorized

Latest Updates