నకిలీ సిరప్, న్యూట్రిషన్ పుడ్ : మనుషులేనా.. పిల్లల ప్రాణాలతో చెలగాటమా

syrupఅనుమతులు లేకుండా ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో చిన్నపిల్లల న్యూట్రిషన్‌ ఫుడ్, సిరప్‌లు అక్రమంగా తయారు చేస్తున్న ముఠాని టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పక్కా సమాచారంతో మార్చి29వ తేదీ  ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వంచారు.  సిరప్ లు, న్యూట్రీషియన్ ఫుడ్ తయారీ కేంద్రాన్ని చూసి షాక్ అయ్యారు. చిన్ని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఖంగుతిన్నారు. ఏ మాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు. 25 లక్షల విలువైన న్యూట్రిషన్‌ సిరప్‌లు, కెమికల్స్‌ కలిపిన ద్రావణం, ముడి సరుకులు, యంత్ర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.

చిన్నపిల్లల ఆహారంకి సంబంధించి తయారు చేయాలంటే చాలా నిబంధనలు పాటించాలి. అంతేకాకుండా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. అలాంటివి ఏమీ లేకుండా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుని.. ఇష్టమొచ్చిన విధంగా ఈ సిరప్ లు, ఫుడ్ తయారు అవుతుంది. ఎలాంటి పర్మీషన్స్ లేవు. బస్తీలు, మురికివాడలు, గ్రామీణ ప్రాంతాలే వీరి టార్గెట్. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ సరుకు సప్లయ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

మూసారంబాగ్‌ డివిజన్ SBI ఆఫీసర్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో సిరప్‌లు, న్యూట్రిషన్‌ ఫుడ్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హిమాలయ లైఫ్‌ లైన్‌ పేరుతో 30 ఏళ్లుగా గాబ మనీశ్‌ అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో నకిలీ సిరప్‌లు తయారు చేస్తున్నాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. 43 రకాల ఫ్లేవర్స్‌తో సరుకు తయారు చేయటం విశేషం. వీటిపై ఎలాంటి హెచ్చరికలు, సూచనలు లేవు. నిందితుడు మనీశ్‌ను మలక్‌పేట పోలీస్‌లకు అప్పగించారు. మనీశ్‌ తయారు చేస్తున్న ఉత్పత్తుల శాంపిల్స్‌ను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సేకరించారు.

Posted in Uncategorized

Latest Updates