నగదు కొరత అకస్మాత్తుగా రాలేదు : కేటీఆర్

ktrబ్యాంకుల్లోనూ, ఏటీఎంల్లోనూ ఏర్పడ్డ నగదు కొరత అకస్మాత్తుగా రాలేదని, అది పాక్షికమైన అంశం కాదని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ చేసిన ట్వీట్‌ కు స్పందించాడు కేటీఆర్. హైదరాబాద్‌లో గత మూడు నెలలుగా నగదు కొరత గురించి ఫిర్యాదులు వింటున్నామని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు కేటీఆర్. ఆర్బీఐతో కలిసి ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖను కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఆయన.

Posted in Uncategorized

Latest Updates