నగరం నడిబొడ్డున కారుతో మందుబాబుల బీభత్సం

car accidentన‌గ‌రంలో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ వీరంగం సృష్టించారు… మద్యం మత్తులో కారును అతివేగంగా ఫుట్‌పాత్ పైకి ఎక్కించి గోడను ఢీకొట్టారు. ఈ సంఘటన నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ విద్యుత్ సౌధ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు యువతులు, నలుగురు యువకులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా వాహనం అతివేగంగా దూసుకురావడం చూసి భయాందోళనకు గురయ్యామని చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ విద్యుత్ సౌధ ప్రాంతంలో అర్థరాత్రి కావ‌డం, ఫుట్‌పాత్ పై ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఘటన స్థలంలో దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై మందుబాబులు దౌర్జన్యానికి దిగారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని పరిశీలించేందుకు రావడం చూసి కంగారుపడ్డ యువతీ యువకులు పోలీసులు వ‌చ్చేస‌రికి అక్కడి నుంచి పరారయ్యారు.

Posted in Uncategorized

Latest Updates