నచ్చిన వ్యక్తితో మూడు ముళ్లు : కోర్టును ధిక్కరించి పెళ్లి చేసుకున్న MP శశికళ పుష్ప

sasiకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ పెళ్లి చేసుకున్నారు రాజ్యసభ MP శశికళ పుష్ప. తమిళనాడులోని మధురైలో ఈ రోజు(మార్చి 26) ఉదయం డాక్టర్ రామస్వామితో శశికళ వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి కోర్టు ధిక్కారణ కిందకు రానుంది.

రామస్వామి తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదంటూ అతని మొదటి భార్య సత్యప్రియ (34) కంఫ్లైంట్ చేసింది. రామస్వామి మెదటి పెళ్లి.. ఇంకా చట్టబద్దంగానే ఉన్నందున శుక్రవారం(మార్చి23) మధురై ఫ్యామిలీ కోర్టు వీరి పెళ్లిపై స్టే విధించింది. మరో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులివ్వాల్సిందేనని కోర్టు సృష్టం చేసింది. మార్చి 19న సత్యప్రియ మధురై జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాశారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత నుంచి రామస్వామి తనతో మాట్లాడటం మానేశాడని.. నువ్వు వద్దు, నీ ఆడపిల్ల వద్దూ అని తనతో అన్నాడని ఆ లెటర్ లో సత్యప్రియ తెలిపింది.

కోర్టులో రామస్వామి రెండో పెళ్లిపై స్టే ఉన్నప్పటికీ మార్చి 26వ తేదీ సోమవారం ఉదయం అతను.. రాజ్యసభ ఎంపీ శశికళ పుష్పను పెళ్లి చేసుకున్నారు. మూడు ముళ్లు వేశారు. ఏడడుగులు నడిచారు. తమిళనాడు రాష్ట్రం మధురై ఈ జంట ఒక్కటి అయ్యింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, ఆప్తులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం శశికళ పుష్ప వయస్సు 41 సంవత్సరాలు.

 

 

Posted in Uncategorized

Latest Updates