నటి శ్రీదేవి కన్నుమూత

sri
సినీ నటి శ్రీదేవి కన్నుమూశారు. అతిలోక సుందరి అనంత లోకాలకు తరలివెళ్లారు. సినీ వినీలాకశంలో ఓ వెలుగువెలిగిన శ్రీదేవి ఆకస్మిక మరణం కోట్లాది మంది ప్రేక్షకులను దిగ్ర్భాంతికి గురి చేసింది. బాల నటిగా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి… మూడు తరాల నటులతో నటించారు. తెరపై శ్రీదేవి కనపడిందంటే చాలు… తమ ఇంట్లో మనిషిలా ఆదరించారు ప్రేక్షకులు. తన అద్భుతమైన నటనతో ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం కోట్లాది ప్రేక్షక హృదయాలను కలిచివేసింది. తాతకు మనువరాలిగా… ఓ తండ్రికి అచ్చమైన కూతురిలా… ప్రియుడి మనుసదోచుకునే ప్రియురాలిగా ఆమె నటనకు అంతా ఫిదా అయిపోవాల్సిందే. చిట్టిపొట్టి మాటలతో చంటి పిల్లలా నటించాలన్నా…పదహారణాల పల్లెటూరి పిల్లలా తన అభినయనంతో ఆకట్టుకోవాలన్నా అది ఆమెకే సొంతం.

తెలుగులో నాటి తరం టాప్ హీరోలందరితో నటించారు శ్రీదేవి. వసంత కోకిలతో నటిగా ట్రెండ్ సెట్టర్ గా మారారు. నేటి తరం హీరోయిన్లు కూడా వసంత కోకిల డ్రీమ్ రోల్ అని చెబుతుంటారంటే… శ్రీదేవి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates