నటీనటుల ఎంపిక నిర్మాత డిసైడ్ చేస్తాడు: నాగబాబు

nagaసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై వస్తున్న విమర్శలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరోసారి స్ట్రాంగ్ గా రియాక్టయ్యింది. సినిమాల్లో ఎవరిని తీసుకోవాలనేది నిర్మాత డిసైడ్ చేస్తాడని మా మాజీ అధ్యక్షుడు నాగబాబు చెప్పారు. తెలుగు వారినే తీసుకోవాలని రిక్వెస్ట్ మాత్రమే చేయగలుగుతామన్నారాయన. అవకాశాల కోసం ఎవరైనా ఇబ్బందిపెడితే… అమ్మాయిలు కఠినంగా బదులిచ్చినప్పుడే క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతం అవుతుందన్నారు నాగబాబు.

పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిచ్చిన నాగబాబు.. అమ్మాయి కాబట్టే మాట్లాడకుండా ఉన్నామన్నారు. అవగాహన లేనివాళ్లు సినిమాల గురించి మాట్లాడుతున్నారని.. రాజకీయ ఉద్దేశాలతోనే కొన్ని మీడియా సంస్థలు చర్చలు జరుపుతున్నాయన్నారు.

సినిమా ఇండస్ట్రీలో అన్యాయాన్ని ఎదిరించేందుకు వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని తప్పుపట్టింది నటి మాధవీ లత. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ కు నిరసనగా ఆమె ఫిలిం చాంబర్ దగ్గర మౌన దీక్ష చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు.

పవన్ కల్యాణ్ తల్లికి మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ట్విట్టర్ తెలిపారు శ్రీరెడ్డి. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. శ్రీరెడ్డికి మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్టు ఓయూ జేఏసీ తెలిపింది. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టిన ఓయూ జేఏసీ… సినిమా ఇండస్ట్రీలో చెడు సంస్కృతిపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates