నటుడు బెనర్జీ తండ్రి రాఘవయ్య కన్నుమూత

BENA టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ తండ్రి రాఘ‌వ‌య్య (86) హార్ట్ ఎటాక్ తో ఈ రోజు(ఏప్రిల్-15) ఉదయం మృతి చెందారు. రాఘవయ్య చివరిగా కొర‌టాల శివ తెర‌కెక్కిన భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించారు. టాలీవుడ్‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులతో ప‌నిచేసిన రాఘ‌వ‌య్య వీరాంజ‌నేయ‌, క‌థానాయ‌కుడు, య‌మ‌గోల వంటి సినిమాల‌తో పాపుల‌ర్ అయ్యారు. రాఘవయ్య మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఆయ‌న మృత దేహాన్ని స్వ‌గృహంలో ఉంచారు. మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కి ఫిలిం న‌గ‌ర్‌ లోని మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గనున్నాయి. రాఘ‌వ‌య్య కుటుంబానికి సినీ ప్రముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

Telugu Actor Banerjee at Lemon Movie Audio Release Stills
Telugu Actor Banerjee at Lemon Movie Audio Release Stills

Posted in Uncategorized

Latest Updates