నడిరోడ్డుపైనే : ఎమోషన్ లో గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే

prasad

ఉద్యమం.. ఉద్యమం అంటూ అందరూ రోడ్డెక్కారు. నేను ఎక్కకపోతే ఎక్కడ వెనకబడిపోతానో అనుకున్నారో ఏమో.. ఏపీ రాష్ట్రం ఎమ్మెల్యే కూడా రోడ్డెక్కారు. అధికార పార్టీలోనే ఉండి.. కేంద్రం అన్యాయం చేస్తుందంటూ జనంతో కలిసి ఆందోళనకి దిగారు. ఏదో ఒకటి చేసి తన నిరసనను బలంగా వినిపించాలని డిసైడ్ అయ్యారు. అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా నిరసన వ్యక్తం చేయాలని భావించారు. అంతే నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ఎవరూ ఊహించని విధంగా నడిరోడ్డుపైనే గుండు కొట్టించుకున్నారు.

ఉదయం బాగానే ఉన్న వ్యక్తి.. ఇలా హఠాత్తుగా ఉద్యమంలో.. నడిరోడ్డుపై గుండె కొట్టించుకోవటంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేకి మద్దతుగా బంద్ ను విజయవంతం చేశారు. ఉయ్యూరు సెంటర్ లో జనజీవనాన్ని స్తంభింపజేశారు. గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలిసేలా నిరసన చేపట్టినట్లు తెలిపారు. బంద్ ఎలా ఉన్నా.. టీడీపీ నిరసనలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుండు మాత్రం బాగా హైలెట్ అయ్యింది మీడియాలో..

 

Posted in Uncategorized

Latest Updates