నడిరోడ్డుపై చిందులేసిన TRS నేత

trs
గ్రేటర్‌ హైదరాబాద్ లో ఆయనో కార్పొరేటర్‌. ప్రజా సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. ప్రజా సమస్యలపై స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ  మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కూడా అందుకున్నారు. అదే కార్పొరేటర్ పై విమర్శలు గుప్పుమంటున్నాయి. హయత్‌నగర్‌ TRS కార్పొరేటర్‌ సామ తిరుమల్‌ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు.

అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్‌ ఆడారు. రెండు వైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్‌గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates