నన్ను పులి అన్నా…పిల్లి అన్నా మీ ఇష్టం: జగ్గారెడ్డి

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులంతా TRS పార్టీ కార్యకర్తలేనన్నారు కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. TRS భారీ విజయం తర్వాత  సీఎం కేసీఆర్ ను విమర్శించనంటూనే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చాక నిందించడానికి ఏమీలేదన్న అయన… ప్రభుత్వ ఉద్యోగులంతా TRS కార్యకర్తలుగానే ఈ ఎన్నికల్లో పని చేశారని ఆరోపించారు. వచ్చే ఐదేళ్లు సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్దే తనకు ముఖ్యమని దానికోసం సీఎం, మంత్రుల దగ్గరకైనా వెళ్తానన్నారు. దీనిపై నన్నుపులి అన్నా..పిల్లి అన్నా మీ ఇష్టం అన్నారు. అంతే కాదు ఎన్నికల ముందు తమ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కూడా స్పందించారు. ఎన్నికల వారం ముందు అభ్యర్థులను ప్రకటించడం మా పార్టీ మానుకోవాలని సూచించారు జగ్గారెడ్డి.

Posted in Uncategorized

Latest Updates