నన్ను ప్రశ్నిస్తే కాల్చిపడేస్తా: ఢిల్లీలో అర్ధరాత్రి ఘోరం

delhi-road-rage_650x400_51517893647ఢిల్లీలో ఘోరం జరిగింది. వేగంగా వాహనం ఎందుకు నడుపుతున్నావ్ అని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం(ఫిబ్రవరి5) రాత్రి నార్త్ ఢిల్లీ ఫ్లైఓవర్ పై జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపింది. వినోద్‌ మెహ్రా(35) అనే వ్యక్తి తన బంధువుతో కలిసి ఓ వివాహానికి హాజరై తన వాగన్‌ఆర్‌ కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. నార్త్ ఢిల్లీ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న సమయంలో ఓ వ్యాన్‌ అతి వేగంగా వచ్చి మెహ్రా కారును ఓవర్‌టేక్‌ చేసింది. దీంతో మెహ్రా ఆ వ్యాన్‌ను ఆపి ఎందుకంత వేగం అని ప్రశ్నించడంతో అతడు వినోద్ మెహ్రాతో గొడవకు దిగాడు. దీంతో వ్యాన్‌లో నుంచి ఓ వ్యక్తి కిందకు దిగి మెహ్రా ఛాతిలో తుపాకీతో కాల్చి వెళ్లిపోయారు. మెహ్రా బంధువైన ఓ యువకుడు మరో వ్యక్తి సాయంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే  మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన యువకుడు వ్యాన్‌ నెంబర్‌ ప్లేట్‌ గుర్తుపెట్టుకున్నాడని, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

Posted in Uncategorized

Latest Updates