నన్ను సీట్లో కూర్చోబెట్టేది, పంపించేది 125 కోట్ల మంది : విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ

నన్ను ప్రధాని సీట్లో కూర్చోబెట్టేది, పంపించేది 125 కోట్ల మంది భారతీయులని మోడీ అన్నారు. 2019 లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే… రాహుల్ ప్రధాని అవుతారని చెబుతున్నారని, కానీ వారిలో చాలామందికి ఆ పదవిపై ఆశ ఉందని, వారి మాటేమిటని మోడీ అన్నారు. మోడీ ప్రసంగ సమయంలో టీడీపీ  ఎంపీలు ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు టీడీపీ ఎంపీలు. నల్లధనంపై తమ పోరాటం ఆగదన్నారు. ఒక్క మోడీని దించేందుకు ఇంత ప్రయాస పడుతున్నారెందుకని ప్రతిపక్షాలనుద్దేశించి మోడీ అన్నారు. 4,500 కోట్ల విలువై బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 కోట్ల మంది పేదరికం నుంచి బయటకి వచ్చారన్నారు.

యోగా డే, రిజర్వ్ బ్యాంక్, చీఫ్ జస్టిస్, ఈవీఎమ్, గణాంక సంస్ధలపై ప్రతిపక్షాలకు నమ్మకం లేదన్నారు. విపక్షాలకు తమపై తమకే నమ్మకం లేదన్నారు. దేశంపైనే విపక్షాలకు నమ్మకం లేదన్నారు. డోక్లాం దేశ భధ్రతకు సంబంధించిన విషయం అని, దీన్ని కూడా కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. సైన్యం గురించి మీరు ఇలాంటి భాష మాట్లాడుతారా అంటూ ప్రతిపక్షాలను తప్పుబట్టారు మోడీ.  సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. సర్జికల్ స్ట్రెయిక్స్ ను తప్పుపట్టినవాళ్లెవ్వరని ప్రజలు క్షమించరన్నారు.

తన కళ్లల్లోకి కళ్లు పెట్టి మాట్లాడే ధైర్యం మోడీకి లేదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ గా…. కళ్ల గురించి మాట్లాడేవాళ్ల చేష్టల్ని ఈ రోజు దేశం చూసిందన్నారు. మీ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేమన్నారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ, జేపీ, మొరార్జీ దేశాయ్, సుభాష్ చంద్రబోస్, చరణ సింగ్ మీ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే ఏయయిందో తెలుసునన్నారు. తాను ఎవ్వరినీ వదిలిపెట్టనని, అందరికీ సమాధానం చెబుతానన్నారు.

ఓటుకు నోటు వంటి వాటిని మర్చిపోతారన్నారు. మీరు మాటలు చెప్పేవాళ్లు, మేము పనిచేసే వాళ్లమన్నారు. ఆరో అతిపెద్ద ఆర్ధికవ్యవస్ధగా భారత్ అవతరించిందని, ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలకు అభివృద్ది కన్పించడంలేదన్నారు. ఏ భక్తి లేని వారు కూ ఈ మధ్య శివుడి గురించి మాట్లాడుతున్నారన్నారు. 2 లక్షల డబ్బా కంపెనీల వెనుక ఎవరి హస్తం ఉందన్నారు. అరచి గగ్గోలు పెట్టి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ముందు మద్దతిచ్చి తర్వాత కుర్చీ లాగేసుకొని చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. పదేపదే దేశాన్ని అస్ధిరపరిచిన పాపం కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల కోసం 8 కోట్ల టాయిలెట్లు కట్టించామన్నారు. మొబైల్ ఫోన్లతో ఒక్క నెలలోనే 41 వేల కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిగాయన్నారు

Posted in Uncategorized

Latest Updates