నన్యాంగ్ టెక్నికల్ యూనివర్శిటీలో వేప మొక్క నాటిన మోడీ

slభారత్-సింగపూర్  మధ్య   పలు ఒప్పందాలు  జరిగాయి. 25  ఏళ్ల  సింగపూర్-భారత్  సంబంధానికి  గుర్తుగా  కొన్ని కీలక  ఒప్పందాలపై  సంతకాలు  చేశారు  ఇరుదేశాల  ప్రధానులు.  రక్షణ,  నావికా దళానికి సంబంధించిన  కీలక ఒప్పందాలు  జరిగాయి. డిజిటల్  ఇండియాలో  భాగంగా  భారత్  రూపొందించిన  రూపే కార్డులు,  భీమ్,  UPI యాప్స్  ద్వారా… చాంగి  ఎయిర్ పోర్టులో  సెలెక్టెడ్  ఆపరేటర్స్  ద్వారా వాడుకోవచ్చు  అన్నారు  సింగపూర్  ప్రధాని  లీ లూంగ్.  అలాగే  ఏపీ రాజధాని  అమరావతిని  సింగపూర్ కన్సార్షియం  ద్వారా  అభివృద్ధి  చేసేందుకు  ప్రణాళికలు   సిద్ధం చేస్తున్నామన్నారు . మహారాష్ట్ర-సింగపూర్ జాయింట్  కమిటీ  అధ్వర్యంలో  పూణె ఎయిర్ పోర్టు  నిర్మిస్తామన్నారు.  సింగపూర్ తో  కీలక ఒప్పందాలు చేసుకోవడం  సంతోషంగా  ఉందన్నారు  ప్రధాని మోడి. సింగపూర్ ప్రధాని లీ లూంగ్ తో కలసి నన్యాంగ్ టెక్నికల్ యూనివర్శిటీని సందర్శించారు మోడీ. యూనివర్శిటీ, ఫ్రొఫెసర్లు, విద్యార్ధులతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తరువాత యానివర్శిటీ ప్రాంగణంలో వేప మొక్కను నాటారు.

Posted in Uncategorized

Latest Updates