నన్ పై రేప్ కేసు : మాజీ బిషప్ కు బెయిల్ నిరాకరించిన కేరళ హైకోర్టు

నన్ పై రేప్ కేసులో అరెస్ట్ అయిన జలందర్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కేరళ హైకోర్టు. బెయిల్ కోరుతూ ఫ్రాంకో ములక్కల్‌ పెట్టుకున్న అప్లికేషన్ ను బుధవారం(అక్టోబర్-3) హైకోర్టు కొట్టేసింది. 2014- 2016 మధ్యకాలంలో 13 సార్లు 45 ఏళ్ల నన్ పై రేప్ కి పాల్పడ్డాడన్న ఆరోపణలతో సెప్టెంబర్-21న కేరళ పోలీసులు ములక్కల్ ని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్- 22న కొట్టాయంలోని పాలా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చిన ఆయనను అదేరోజు పోలీసు కస్టడీకి తరలించారు. సెప్టెంబర్-24న కోర్టు ఆయనను అక్టోబర్-6 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. అరెస్టుకు ముందు కూడా మూడు రోజుల పాటు ఆయనను పోలీసులు ప్రశ్నించారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఫ్రాంకో ములక్కల్ చెబుతోన్నారు. చర్చికి వ్యతిరేకంగా జరగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అంటోన్నారు.

Posted in Uncategorized

Latest Updates