నమస్తే పెట్టలేదని… యువకులపై దాడి

హైదరాబాద్ లో అర్థరాత్రి గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. నమస్తే పెట్టలేదని ఓ గ్రూపుకు చెందిన వ్యక్తులు మరో గ్రూపునకు చెందిన వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రహమత్ నగర్‌లో జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. ఓ యువకుడి బైక్‌ను సైతం తగులబెట్టారు. రహమత్ నగర్‌ కు చెందిన TRS లీడర్ అరుణ్‌… స్థానికంగా ఉంటున్న ఉమాకాంత్‌ అనే యువకుడు నమస్తే పెట్టకపోవటంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉమాకాంత్‌ అండ్‌ గ్యాంగ్‌ను తీవ్రంగా మందిలించాడు. దీంతో మాటామాటా పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఉమాకాంత్‌కు చెందిన బైక్‌ను అరుణ్‌ గ్యాంగ్ తగులబెట్టారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి ఉమాకాంత్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి కూడా వచ్చిన అరుణ్‌.. ఉమాకాంత్‌ను చంపుతానంటూ పోలీసుల ముందే బెదిరించాడు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేశారు.

అరుణ్‌కు నమస్తే పెట్టలేదనే కోపంతోనే తనపై క్షక్ష్య కట్టారని బాధితుడు ఉమాకాంత్‌ తెలిపాడు. అందులో భాగంగానే రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో తనను చంపేందుకు అరుణ్ అతని అనుచరులు యత్నించారని చెప్పాడు. తనపై పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకొని, బైక్ వదలి పారిపోయినట్లు తెలిపాడు. దీంతో తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. నాకు ప్రాణహాణి ఉంది, పేద కుటుంబం.. నాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను సేవ్ చేయడానికి వచ్చిన పవన్ అనే వ్యక్తిపై రౌడి షీట్‌ బుక్ చేస్తున్నారని తెలిపాడు.

రాత్రి సమయాల్లో ఎవరైనా హంగామా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకంటామని ఏసీపీ ఏఎస్‌ రావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో అరుణ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Latest Updates