నమ్మలేని నిజం : చనిపోయిన వ్యక్తి బతికాడు.. గంటసేపు ఆగిన గుండె

heart

అలా ఆగితే చాలు.. ప్రాణాలు పోయాయి అంటాం. ఇప్పుడే.. జస్ట్ నిమిషం కూడా కాలేదు గుండెపోటు వచ్చి.. అప్పుడే చనిపోయాడు.. ఇలాంటి మాటలు తరచూ వింటాం. అందుకు విరుద్ధంగా ఓ అద్భుతం జరిగింది. గుండె ఆగిపోయి గంటసేపు అయ్యింది. అయినా ఆ యువకుడు బతికాడు. ఇప్పుడు చక్కగా ఉన్నాడు. గంటసేపు గుండె కొట్టుకోవటం ఆగిపోయినా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించిన డాక్టర్లు.. చివరికి అనుకున్నది సాధించారు. చనిపోయిన వ్యక్తిని బతికించారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి. 12 రోజుల క్రితం అలీగఢ్‌కు చెందిన ఆసిఫ్‌ ఖాన్‌(22) అనే ఇంజినీరు గుండెనొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే గుండె ఆగిపోయింది. ఆ సమయంలో సారీ అంటూ డాక్టర్లు  చెప్పటం కామన్. ఆ డాక్టర్లు మాత్రం వదల్లేదు. గుండె ఆగినా.. కార్డియో పల్మనరీ రీససిటేషన్‌ (సీపీఆర్‌)తో రక్తం సరఫరా చేస్తూనే ఉన్నారు. డీఫైబ్రిలేటర్‌ తో గుండెకు షాక్‌లు ఇచ్చారు. అలా గంట సేపు షాకులు ఇస్తూనే ఉన్నారు. ఓ వైపు షాకులు, మరోవైపు రక్త సరఫరా జరుగుతున్న సమయంలో.. రక్తనాళంలో గడ్డకట్టిన వాటిని తొలగించారు. స్టెంట్‌ వేశారు. ఈ ప్రక్రియ మొత్తం గంటసేపు జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా గుండె కొట్టుకోవటం ప్రారంభించింది. డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. చనిపోయిన వ్యక్తిని బతికించిన ఘనత సాధించారు. ప్రస్తుతం ఆసిఫ్‌ ఖానర్ ఆరోగ్యం కుదుటపడింది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. వైద్య రంగంలోనే ఇదో అద్భుతం..

Posted in Uncategorized

Latest Updates