నమ్మలేని నిజం : రోడ్డు పనుల్లో లంకె బిందెలు దొరికాయి

వారందరూ కూలీలు.. రోజువారీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు.. రోజువారీగానే వారు రోడ్డు పనికి వెళ్లారు.. అప్పుడు వారికి లంకె బిందెలు దొరికాయి.. కళ్లు తిరిగాయి.. మరి ఆ లంకె బిందెలు వారి ఇంటికి చేరాయా.. లేదా.. తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
చత్తీస్ ఘడ్ రాష్ట్రం కొండగావ్ జిల్లా. కోర్ కోటీ – బోద్మా గ్రామాల మధ్య రోడ్డు వేస్తున్నారు. దీని కోసం రోడ్డు పక్కన తవ్వకాలు చేస్తున్నారు కూలీలు. ఆ టైంలో వారికి ఓ కుండ దొరికింది. దానికి మూత ఉండటం.. అది చాలా గట్టిగా ఉండటంతో అనుమానం వచ్చింది. పగలగొట్టారు. ఆశ్చర్యం.. అందులో బంగారు నాణెలు ఉన్నాయి. లెక్కేస్తే.. మొత్తం 57 బంగారు నాణెలు. ఓ వెండి నాణెం కూడా ఉంది. బంగారు చెవి దిద్దులు కూడా ఉన్నాయి. ఒకరు, ఇద్దరు కూలీలు ఉంటే బాగుపడే వారు.. అయితే అక్కడ పదుల సంఖ్యలో ఉన్నారు. దీంతో వాటిని కోర్ కోటి గ్రామ సర్పంచ్ కు అందజేశారు. ఆయన జిల్లా కలెక్టర్ కేతన్ కు అప్పగించారు.
లంకె బిందెలో దొరికిన నాణేలను పురావస్తుశాఖకు అప్పగించారు కలెక్టర్. వాటిని పరిశీలించిన అధికారులు.. 12వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతాన్ని పరిపాలించిన యాదవుల కాలంలో చెలామణిలో ఉన్న నాణేలుగా గుర్తించారు. నాణేలు చిన్నవిగా ఉన్నాయి. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాటిపై గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. లంకె బిందెలు, గుప్తనిధులు ఉన్నాయా అంటే.. కచ్చితంగా ఉన్నాయి అనటానికి ఇదో సాక్ష్యం…

Posted in Uncategorized

Latest Updates