నమ్మించి ముంచారు : పనిచేస్తున్న షాపులోనే రూ.15 లక్షల దొంగతనం

పనిచేస్తున్న  షాప్ లోనే  దొంగతనానికి  పాల్పడ్డ  ఇద్దరు వ్యక్తులను  అరెస్ట్ చేశారు సుల్తాన్ బజార్  పోలీసులు. జూలై  9న  కోఠిలోని  ఓ బట్టల షాప్ లో  పనిచేస్తున్న మనీష్ కుమార్ తో  పాటు  అదే షాపులో  గతంలో పనిచేసిన  భూపేష్ ప్రజాపత్  ఇద్దరు  కలిసి  చోరీ చేశారు. 15 లక్షల విలువ చేసే బట్టలు, 5 లక్షల  నగదును ఎత్తుకెళ్లారు. షాప్ యజమాని  ఫిర్యాదుతో  నిందితులిద్దరిని  అరెస్ట్ చేశారు. చోరీ సొమ్ము మొత్తం  రికవరీ చేశారు.

జల్సాలకు అలవాటు పడి ఇటీవలే దుకాణంలోని కొన్ని దుస్తులను దొంగిలించి రిటైల్‌ వ్యాపారులతోపాటు, రాజురామ్‌ అనే వ్యక్తికి విక్రయించారు. తామే దుకాణ యజమానిగా నమ్మించి అతని వద్ద నుంచి రూ.20 లక్షల అడ్వాన్సు రూపంలో తీసుకోవాలని పథకం రూపొందించారని తెలిపారు DCP రమేశ్‌. పాపులో ఇటీవలే రూ.5లక్షల నగదు చోరీకి గురైంది. దీంతో యజమాని  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో దొంగతనం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన రెడీమేడ్‌ దుస్తులు, రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates