నయా సర్ధార్ పటేల్ : RSS మీటింగ్ చీఫ్ గెస్ట్ గా ప్రణబ్ ముఖర్జీ

rss

చిత్రం.. భళారే విచిత్రం.. ఇది పాటే కానీ.. అప్పుడప్పుడు వాస్తవం కూడా అవుతుంది. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర హోం, ఆర్థిక శాఖ మంత్రిగా.. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ట్రబుల్ షూటర్  గా పని చేసి.. అనంతరం రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేసిన ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ – RSS మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. జూన్ 7వ తేదీన RSS ప్రధాన కార్యాలయం అయిన నాగపూర్ లో జరిగే ఓ కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్నారు. RSS ఎడ్యుకేషనల్ వింగ్ నిర్వహిస్తున్న 25 రోజుల క్యాంప్ సెషన్ లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలసి ముఖ్య అతిధిగా ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటున్నారు. 600 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

ఆరెస్సెస్ నాయకులు ఉగ్రవాదులంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించి, ఆరెస్సెస్ సిద్దాంతాలను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్లు కొనసాగిన తర్వాత బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ వెళ్లడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అప్పుడే ప్రణబ్ ని కొత్త సర్ధార్ పటేల్ అంటూ ఆరెస్సెస్ నాయకులు కీర్తిస్తున్నారు. ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించడం తమ సాంప్రదాయం అని.. అందుకోసమే ఆరెస్సెస్ ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినట్లుగా ప్రకటించారు. ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని ఆరెస్సెస్ నాయకులు ప్రకటించారు. ప్రణబ్ ఓ అభినవ సర్ధార్ పటేల్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates