నయీం కేసు: పోలీసులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

nayeemగ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో సస్పెండైన పోలీసు అధికారులకు ఊరట లభించింది. వారిపై ఉన్న కేసులను ఎత్తివేసింది హోం శాఖ. నయీం ఎన్ కౌంటర్ తర్వాత కొంత మంది పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నయీంకు అండగా నిలిచారనే ఆరోపణలతో అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. తమపై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో ఆ పోలీసు అధికారులు శుక్రవారం(జులై-6) డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates