నరబలి కేసు : ఆ రెండు చుక్కుల రక్తమే పట్టించింది

uppal-murder-1చిన్నారి నరబలి కేసును గురువారం (ఫిబ్రవరి-15) ఛేధించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఆరోగ్యం కోసం క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిలకానగర్‌లో క్షుద్ర పూజల కోసమే రాజశేఖర్ నరబలి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా.. అక్కడ ఓ కోయదొరను కలిశారు.

ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలత బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించారు. చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే భార్య జబ్బు తగ్గుతుందని కోయదొర చెప్పడంతో ఫిబ్రవరి 1న అర్ధరాత్రి బోయగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న.. మూడు నెలల పసికందును రాజశేఖర్ ఎత్తుకొచ్చాడు.

బలి ఇచ్చిన అనంతరం ప్రతాప్ సింగారం దగ్గర మూసీ ఒడ్డున తెల్లవారుజామున 2 గంటలకు.. పాప తలనరికి మొండెంను నదిలో పడేశాడు. పాప తలను తెచ్చి భార్యతో కలిసి రాజశేఖర్ క్షుద్రపూజలు చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకు పసికందు తలను.. నైరుతీలో చంద్రుడి కిరణాలు పడేలా ఇంటిపైన పాప తలను  పెట్టాడు రాజశేఖర్. అనంతరం క్యాబ్‌లో బయటకు వెళ్లి డ్రామా ఆడాడు. కేసులో అనేక మలుపులు. నిందితుడు ఎంతకీ నేరం ఒప్పుకోలేదు. దీంతో కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడే రాజశేఖర్ ఇంటిని అణువణువూ పరిశీలించారు. వారికి రెండు రక్తపు చక్కల మరకలు కనిపించాయి. DNA పరీక్షకి పంపించగా.. పాప రక్తంతో సరిపోయాయి. దీంతో కేసు చిక్కుముడి వీడిపోయింది. రాజశేఖర్ నేరం ఒప్పుకోకతప్పలేదు అని వివరించారు సీపీ మహేష్ భగవత్. కేసులో 122 మంది కాల్ డేటా విశ్లేషణ, 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వంద సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. చివరకు DNA రిపోర్టు ద్వారా వీరి తతంగం బయటపడింది.

Posted in Uncategorized

Latest Updates