నర్సింగ్‌ లెక్చరర్ల రిటైర్మెంట్‌ వయసు 70 ఏళ్లకు పెంపు

నర్సింగ్ కాలేజీల్లో బోధనా సిబ్బంది రిటైర్మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిరయ్ణం తీసుకుంది. నర్సింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకే ఈ నిరయ్ణం తీసుకున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  జగత్ ప్రకాశ్ నడ్డా తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోఇకపై నేరుగా ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్స్ ప్రారంభించేందుకు అవకాశమిచ్చింది. నర్సింగ్స్ స్కూల్ లేని ఆస్పత్రులు  MSC నర్సింగ్ కోర్స్ నడపొచ్చు. ఈ కోర్సులో ఐదుగురు స్టూడెంట్స్‌కు ఒక టీచర్ ఉండాలన్న రూల్ మార్చి 10 మందికి ఒక టీచర్ ఉండేలా సవరించారు.ఒక నర్సింగ్  స్టూడెంట్ కు ఐదుగురు రోగులుండాలన్న నిబంధనను… ముగ్గురు రోగులున్నా చాలని మార్చారు.  BSC నర్సింగ్‌‌లోనూ అధ్యాపకుల  క్వాలిఫికేషన్ ,అనుభవం విషయంలో మార్పులు చేశారు. దేశంలోని 112 ANM నర్సింగ్, 136 జనరల్ నర్సింగ్ స్కూళ్ల కు నిధుల్ని కేంద్రం మంజూరు చేసింది. దేశంలో మణిపూర్, మిజోరాం, మేఘాలయ మినహా 27 రాష్ట్రాల్లోనూ నర్సింగ్ స్కూళ్లున్నాయి.

Posted in Uncategorized

Latest Updates