నర హంతకుడు ఈ ఓనర్ : క్షుద్రపూజలతో తల నరికి డ్రామాలు ఆడాడు

1UPL1022018మూఢ నమ్మకాలకు ఓ చిన్నారి బలైంది. హైదరాబాద్ ఉప్పల్ చిలకనగర్‌లో జరిగిన నరబలి కేసును మంగళవారం (ఫిబ్రవరి-6) పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని రాజశేఖర్ ప్రధాన నిందితుడిగా తేల్చారు. పాపను చంపింది తానేనని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కరీంనగర్ తండా నుంచి పాపను తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఈ కేసులో పోలీసులు పూజారితో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాప కొనుగోలు విషయంలో మధ్యవర్తిత్వం వహించిన బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టారు.

ఉప్పల్ చిలుకానగర్ లో నివాసం ఉండే రాజశేఖర్ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఆరోగ్యం బాగోలేదు. పూజలు చేయించాడు. చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు చేస్తే భార్య ఆరోగ్యం బాగు అవుతుందని నమ్మించారు పూజారులు. అందులో భాగంగా.. అప్పటికే కొనుగోలు చేసిన చిన్నారిని బలి ఇచ్చాడు. అనంతరం మొండాన్ని మాయం చేసిన రాజశేఖర్, తలను ఇంటి దాబాపై ఉంచాడు. తలను మాయం చేయడానికి వీలుకాకపోవడంతో తన ఇంటిపై పాప తల ఉందని పోలీసులకు సమాచారం అందించాడు.

ఇంటి యజమాని రాజశేఖర్ ఇచ్చిన సమాచారంతో.. అతడి ఇంటి సమీపంలోని క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలిచ్చినట్లు తప్పదారి పట్టించాడు. దీంతో పోలీసులు మెకానిక్ నరహరి, అతని కొడుకు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు విషయంలో రాజశేఖర్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates