నలుగురు మంత్రులు.. స్పీకర్ ఓటమి

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ ఓడిపోయారు. తాండూరులో మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలిచారు. కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు … కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ములుగులో మంత్రి చందూలాల్ పైన.. కాంగ్రెస్ క్యాండిడేట్ సీతక్క గెలుపొందారు. అటు భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి …. కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Posted in Uncategorized

Latest Updates