నలుగురు మహిళలను కాపాడారు.. లేక్ పోలీసుల నిరంతర గస్తీ

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై హుస్సేన్ సాగర్ దగ్గర చాలామంది రిలాక్స్ అయ్యేందుకు వస్తుంటారు. ఐతే…  అతికొద్దిమంది మాత్రమే అందులో దూకి ప్రాణం తీసుకోవాలన్న ఆలోచనతో వస్తుంటారు. హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే.. లేక్ పోలీసులు అక్కడ నిరంతరం గస్తీ కాస్తుంటారు. అలా… మంగళవారం కొందరు మహిళలను కాపాడారు లేక్ పోలీసులు.

వివిధ కారణాలతో  హైదరాబాద్ హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన నలుగురు మహిళలను లేక్ పోలీసులు కాపాడారు. ఓ టెన్త్ క్లాస్ అమ్మాయి కూడా అందులో ఒకరు. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్నారని .. చనిపోదామని నిర్ణయానికొచ్చానని ఆమె పోలీసులకు చెప్పింది. కుటుంబ కలహాలతో ముగ్గురు మహిళలు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి కుటుంబసభ్యుల వివరాలు తెల్సుకుని పిలిపించి అప్పగించారు.

Posted in Uncategorized

Latest Updates