నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి దగ్గర అదుపుతప్పి బస్టాండ్‌ గోడను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు చనిపోయారు. మృతులు హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మిగా గుర్తించారు. ఐదు కుటుంబాలు వేర్వేరు వాహనాల్లో నాగార్జున సాగర్ కు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates