నల్గొండలో దారుణం: కాల్వలో పడ్డ ట్రాక్టర్ ..12 మంది మృతి

accidentనల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీఏపల్లి మండలం వద్దిపట్ల దగ్గర కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి AMR కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. నీటిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం.

కూలీలు వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్లలోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సాయంతో పోలీసులు 9 మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం కాలువలో గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూలీల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి మహేందర్ రెడ్డి…విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates