నల్గొండలో బస్సు ప్రమాదం: ఇద్దరు మృతి

accidentనల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న గాయత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా… 15 మందికి గాయాలైయ్యాయి. వేములపల్లి వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఏపీ 04వై 7191 నంబర్ గల బస్సు వేములపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈసమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డవారిని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సుబోల్తా పడగానే డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates