నల్గొండలో విషాదం: సాగర్ కాల్వలో దూకిన తల్లి,ముగ్గురు పిల్లలు

నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  జిల్లాలోని అనుమల మండలం..  హాలియా దగ్గర ఉన్న సాగర్ కాల్వలో ఓ గృహిణి తన ముగ్గురు పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సాత్విక,మిథున శ్రీ మృతి చెందగా కొడుకు భగవంత్ కుమార్ గల్లంతయ్యాడు. తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం స్వాతిని హాస్పటల్ కు తరలించారు. గల్లంతైన భగవంత్ కుమార్ కోసం గాలిస్తున్నారు.   జిల్లాలోని పెద్దవూర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న  అంగోతు మోహన్ భార్య,పిల్లలుగా వారిని గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates