నల్లగొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలోని కొండ మల్లె పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నాగర్ కర్నూల్ కు చెందిన వారు కాగా… ఒకరు షాద్‌నగర్ వాసి. విజయవాడ న‌గ‌రం నుంచి వస్తుండగా ఆదివారం(జూలై-15) అర్ధ రాత్రి రోడ్డు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాల‌ను పోస్టు మార్టం కోసం త‌ర‌లించారు.

Posted in Uncategorized

Latest Updates