నల్ల కళ్లద్దాలు అందుకే : పవన్ కల్యాణ్ కు కంటి ఆపరేషన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కంటి ఆపరేషన్ జరిగింది. కొన్నాళ్లుగా కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే ఓ ఆడియో ఫంక్షన్ లో నల్ల కళ్లద్దాలతో కనిపించారు. అప్పుడే అన్నారు.. కంటి సమస్య ఉంది అని. అప్పుడే ఆపరేషన్ జరగాల్సి ఉన్నా మందు వాడుతూ వచ్చారు ఇన్నాళ్లు. ఆ తర్వాత నెల రోజులు ఉత్తరాంధ్రలో పర్యటించారు. దీంతో కంటి సమస్య మరింత పెరిగింది. ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం అని.. మందులతో ఎక్కువ రోజులు నెట్టుకురావటం మంచిదికాదని డాక్టర్లు చెప్పారు.

దీంతో తన రాజకీయ పర్యటనలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఎడమ కంటిలోని కురుపును తొలగించారు. ఒక రోజు విశ్రాంతి తర్వాత జూలై 12వ తేదీ గురువారం రాత్రి ఇంటికి పంపించారు. అభిమానులు, వీఐపీలు, ప్రముకుల పరామర్శలు ఉన్నాయనే ఉద్దేశంతో.. పవన్ కల్యాణ్ ఆపరేషన్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం పవన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates